VIDEO: ప్రయాణికులతో గోదావరి మధ్యలో ఆగిపోయిన పంటు
కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని సఖినేటిపల్లి-నరసాపురం వైపు నుంచి సఖినేటిపల్లి రేవుకు వస్తున్న పంటు సాంకేతిక సమస్యలతో సుమారు అరగంటసేపు గోదావరి మధ్యలోనే ఆగిపోయింది. పంటులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ ఆందోళనకు గురయ్యారు. మరొక పంటుకి తాడు కట్టి ఒడ్డుకి తీసుకువచ్చారు. ఈ ఘటన సమయంలో పంటులో సుమారు 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.