NITని సందర్శించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు

WGL: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ కళాశాలను నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ సందర్శించారు. నిట్ డైరెక్టర్‌తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుత విద్యావిధానం, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, కావాల్సిన అవసరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.