BRS శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన KTR
HYD: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించినందుకు బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి KTR హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తాచాటిన గులాబీ నేతలకు ప్రత్యేక అభినందనలు చెప్పారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్న CM రేవంత్ రెడ్డికి ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి అని ట్వీట్ చేశారు.