తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

అన్నమయ్య: తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు వారిలో అవగాహన కల్పించాలని చెప్పుకొచ్చారు.