కన్న కొడుకుని చితకబాదిన కసాయి తండ్రి

కన్న కొడుకుని చితకబాదిన కసాయి తండ్రి

MDK: మద్యం మత్తులో మానవత్వం మరిచిన ఓ మారుతండ్రి నాలుగేళ్ల బాలుడి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి తన నాలుగేళ్ల కొడుకు వంశీని ఎటువంటి కారణం లేకుండా వీపుపై కర్రతో కొట్టాడు. గాయాలపాలైన వంశీకి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు.