కోతిని తప్పించబోయి.. కాలువలోకి దూసుకెళ్లిన కారు
PLD: పిడుగురాళ్ల మండలం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారంపూడికి చెందిన కొందరు కారులో గుత్తికొండ బిలం వైపు వెళుతుండగా, ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన కోతులను తప్పించబోయి వాహనం అదుపుతప్పి నాగార్జునసాగర్ కుడికాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి, కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.