రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
GNTR: తాడేపల్లిలోని పాత రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐ వీరేంద్ర ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇటీవల పాత రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో యువకులు మద్యం మత్తులో స్థానికులను భయపెడుతూ వీరంగం చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.