పండగకు వెళ్లి వస్తుండగా విషాదం

NLG: WGL-HYD హైవేపై రాయగిరి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కేసముద్రం మండలం గాంధీపురం గ్రామం వెంకట్రామ్ తండాకు చెందిన భూక్య సంతోష్ తన కుటుంబీకులతో కలిసి పండగకు ఇంటికి వెళ్లి HYD కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన భార్య అనూష,కూతురు చైత్ర మృతి చెందారు.