'అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి'

'అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి'

ASR: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ యూనియన్ అరకు మండల అధ్యక్ష కార్యదర్శులు రాధభారతి, నిర్మల డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం పలువురు అంగన్వాడీలతో కలిసి అరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అంగన్వాడీ మినీ సెంటర్లను, ఎటువంటి నిబంధనలు లేకుండా మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. అంగన్వాడీ సిబ్బందిపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలన్నారు.