మున్సిపల్ కార్మికుల సమ్మె
AP: రాష్ట్రవ్యాప్తంగా 48 వేల మంది మున్సిపల్ కార్మికులు ఇవాళ(మంగళవారం) సమ్మెకు పిలుపునిచ్చారు. సమయానికి వేతనాలు అందక కుటుంబ పోషణ భారమైందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నిరసనతో ఇవాళ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణ పనులు స్తంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం చర్చలకు వచ్చి పరిష్కారం చూపే వరకు విధులకు హాజరయ్యేది లేదని కార్మికులు చెబుతున్నారు.