త్వరలో హుస్నాబాద్‌‌లో మోడ్రన్ ఫిష్ మార్కెట్..!

త్వరలో హుస్నాబాద్‌‌లో మోడ్రన్ ఫిష్ మార్కెట్..!

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఫిష్ మార్కెట్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వ్యాపార లావాదేవీ, మౌలిక సదుపాయాలపై మంత్రులు ఆరా తీశారు. త్వరలోనే హుస్నాబాద్‌లో అత్యాధునిక మోడ్రన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీనిచ్చారు.