జిల్లాలో ఈనెల 23న క్రీడా ఎంపికలు

జిల్లాలో ఈనెల 23న క్రీడా ఎంపికలు

NLR: నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 23న ఫుట్‌బాల్, బాక్సింగ్ క్రీడల్లో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జసీం తెలిపారు. బాలురు, బాలికలకు అండర్-15, 21 విభాగాల్లో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ముందుగా www.sports.ap.gov.in లేదా క్రీడా యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.