అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవం
ADB: ఇచ్చోడ మండలం నారాయణపూర్‌కు చెందిన సుజాతకు పురిటి నొప్పులు రావడంతో, భర్త లక్ష్మణ్ 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రసవ నొప్పులు ఎక్కువ అవడంతో 108 సిబ్బంది గోపి చాకచక్యంగా వ్యవహరించి, అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. దీంతో పండంటి ఆడ శిశువు జన్మించింది. వారిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పైలెట్ పవర్ బాబు తెలిపారు.