రాగోలులో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం
VZM: గుర్ల మండలం రాగోలు గ్రామంలో సోమవారం రాత్రి ఎస్సై నారాయణరావు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్స్, మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన, మహిళలపై జరిగే నేరాలు, ట్రాఫిక్ నియమాల గురించి వివరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు.