హనుమాన్ జంక్షన్ నుంచి జగదల్పూర్‌కు బస్సు
కృష్ణా: గన్నవరం నుంచి జగదల్పూర్ వెళ్లే బస్సును H.జంక్షన్ వరకు పొడిగించినట్లు గన్నవరం RTC అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. H.జంక్షన్‌లో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30లకు జగదల్పూర్ చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3:30కి జగదల్పూర్‌లో బయలుదేరి H.జంక్షన్‌కు మరుసటి రోజు ఉదయం 5:15 నిమిషాలకు చేరుతుందని అధికారుల తెలిపారు.