నేడు కోవెలకుంట్ల మండల సర్వసభ్య సమావేశం

నేడు కోవెలకుంట్ల మండల సర్వసభ్య సమావేశం

NDL: కోవెలకుంట్ల పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వరప్రసాదరావు తెలిపారు. మండల అధ్యక్షురాలు భీమిరెడ్డి రమాదేవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో విద్య, వైద్యం, రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్ సహా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కావాలన్నారు.