బైజూస్‌కు అమెరికా కోర్టు షాక్
బైజూస్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ LLCకి 1B డాలర్లను వ్యక్తిగతంగా చెల్లించాలని ఆదేశించింది. బైజూస్ ఆల్ఫాకు సంబంధించి 533M డాలర్లు, క్వామ్ షాప్ట్ హెడ్జ్ ఫండ్ ఇంట్రెస్ట్ కోసం 540M డాలర్ల నిధులను చెల్లించాలని తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించటంతోనే ఈ తీర్పును ఇచ్చినట్లు చెప్పింది.