గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
NZB: ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జీ. నాగేశ్వర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఈ నెల 11 నుంచే ప్రారంభమయ్యాయని. వచ్చే ఏడాది జనవరి 21వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉందని తెలిపారు.