లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కు అందజేత

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్పల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు.