కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

HNK: కలెక్టరేట్లో జాతీయ విద్యా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, మైనారిటీ సంక్షేమ అధికారి కె.ఏ. గౌస్ హైదర్ తదితరులు పాల్గొన్నారు.