ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి

ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి

గుంటూరు: ట్రాక్టర్ కిందపడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన నెక్కల్లు గ్రామంలో చోటుచేసుకుంది. క్రైస్తవ సోదరులు పవిత్ర శుక్రవారం సందర్భంగా పెదపరిమి నుంచి అనంతపురం వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పెదపరిమి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.