ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కేసు నమోదు

ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కేసు నమోదు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది మార్చి 22న మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. ఓపెన్ డ్రింకింగ్ చేసిన 22 మందిపై, డ్రంకన్ డ్రైవ్ చేసిన 17మందిపై, పేకాట ఆడుతున్న మరో 16 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ దీపికా తెలిపారు.