అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

WGL: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదం పర్వతగిరి మండలం రావూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు వరంగల్ నుంచి పర్వతగిరి వైపు వస్తున్న కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు