గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ డ్రోన్ దాడులు

గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ డ్రోన్ దాడులు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడుల కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు సంభవించింది. ఈ దాడి కారణంగా ఒక ఫ్యూయల్ డిపోలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విమానయాన శాఖ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇది డ్రోన్ దాడిగా అధికారులు ధృవీకరించారు. కాగా, FEB 28న ఇరాన్- ఇజ్రాయెల్,US యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.