వైభవంగా సీతారాముల కళ్యాణం
CTR: పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. నవమి వేడుకల్లో భాగంగా గురువారం సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల వారి పరిణయోత్సవాన్ని నిర్వహించారు.