కాళోజీ సేవలు చిరస్మరణీయం: అదనపు కలెక్టర్

కాళోజీ సేవలు చిరస్మరణీయం: అదనపు కలెక్టర్

BDK: పాల్వంచ కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా అదనపు కలెక్టర్ విద్యా చందన కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ప్రజా కవి కాళోజి నారాయణరావు సేవలు చిరస్మరణీయం అని వారు అన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యానికి విశేష గుర్తింపు తెచ్చారని కొనియాడారు.