కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వాయిదా
KRNL: తుఫాన్ కారణంగా కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణతో పాటు ఇతర పార్టీ కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా వేశామని జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుంచి కార్యక్రమాలు మళ్లీ ప్రారంభమవుతాయని చెప్పారు.