హీరోను తిట్టిన ఎమ్మెల్యే.. స్పందించిన సీఎం

ATP: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టిన కథనాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్యేలు చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాలని తెలిపారు. తప్పుడు ప్రచారంపై వెంటనే స్పందించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల తప్పులతో జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.