లింబాద్రిగుట్టకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు: DM
NZB: ఆర్మూర్ RTC డిపో నుంచి భీమగల్ మండలంలో ప్రసిద్ధి చెందిన లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మి నృసింహస్వామి జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రవికుమార్ మంగళవారం తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఈనెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 3 రోజులు నడుస్తాయన్నారు. ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలు RTC బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.