కొత్తపల్లి వాగును పరిశీలించిన డీఎస్పీ

NRPT: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ లింగయ్య అన్నారు. మంగళవారం కొత్తపల్లి మండలంలోని వాగును, పరిసర ప్రాంతాలను DSP పరిశీలించారు. వర్షాల కారణంగా వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని, వాటిని దాటడానికి ప్రయత్నించవద్దని చెప్పారు. వాగులు, చెరువుల వద్ద సెల్ఫీ ఫోటోలు తీసుకునేందుకు ఈత కొట్టడానికి వెళ్లరాదని ఆయన హెచ్చరించారు.