బాధితులకు సీఎం సహాయనిధి చెక్కు అందజేత
NZB: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన ఎర్గు సత్యవ్వ చికిత్స కోసం రూ.5 లక్షలు, గుండారం గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్‌కు రూ.60 ముందస్తు సహాయం గురువారం సాయంత్రం అందించారు. దీంతో బాధిత కుటుంబాలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.