మన్యం జిల్లాలో దారుణం

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీతానగరం మండలం బల్ల కృష్ణాపురంలోని ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న బొత్స రవణమ్మ (75)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బంగారం, నగదు కోసమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.