విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

ప్రకాశం: తాళ్లూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమాదేవి విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఇంటి సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి రమాదేవి తీవ్రంగా గాయపడగ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు.