ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
PLD: వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.