VIDEO: చింత చెట్టు పై పిడుగు

ప్రకాశం: మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఓ చింత చెట్టుపై పిడుగు పడి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో పిడుగులు పడుతుండటంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే పిడుగు పడిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.