ఇజ్రాయెల్ బెదిరింపులు చెత్తతో సమానం: హెజ్‌బొల్లా
హెజ్‌బొల్లా చీఫ్ నయీం ఖాసీం సంచలన ప్రకటన చేశారు. తాము సుదీర్ఘ పోరాటానికి సిద్ధమయ్యామని తెలిపారు. రణరంగంలో తమ దెబ్బ చూసి ఇజ్రాయెల్ సైన్యం ఆశ్చర్యపోవడం ఖాయమని చెప్పారు. తమను మట్టుబెడతామని ఇజ్రాయెల్ చేస్తున్న బెదిరింపులు చెత్తతో సమానమని వ్యాఖ్యానించారు. వాటికి ఎలాంటి విలువ లేదన్నారు.