వివాదాల సుడిగుండంలో పంచాయతీ కార్యదర్శులు..!

వివాదాల సుడిగుండంలో పంచాయతీ కార్యదర్శులు..!

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొందరు కార్యదర్శులు విధులకు హాజరుకాకుండా ఫేక్ అటెండెన్స్ చూపినట్లు, ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శిని సూర్యాపేట కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఉన్నాయని సమాచారం.