ఎకరాకు రూ.10వేలు.. రైతులను అవమానించడమే: BJP
TG: మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామనడం వారిని అవమానించడమే అని రాష్ట్ర BJP చీఫ్ రామచందర్ రావు విమర్శించారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో తప్పించుకోవాలని కాకుండా వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం అందించాలని సూచించారు. మరోవైపు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని ఆ పార్టీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.