రైతు నుంచి ప్రతి ధాన్యం గింజ కొంటాం: MLA
SKLM: రైతు నుంచి ప్రతి ధాన్యం గింజ కొంటామని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. మంగళవారం చల్లవానిపేట PACS కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు MLA సూచించారు.