గాఢ నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి!
శారీరక, మానసిక ఆరోగ్యానికి రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల చిరాకు, ఏకాగ్రత తగ్గడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పడుకోవడానికి గంట ముందే ఫోన్, టీవీ దూరంగా ఉండాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం, గదిని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది. క్రమబద్ధమైన నిద్ర అలవాట్లు మీ మెదడును చురుగ్గా ఉంచి, మరుసటి రోజు పనిలో ఉత్సాహాన్నిస్తాయి.