వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన  కలెక్టర్

KMR: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కామారెడ్డిలోని పలు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన హౌసింగ్ బోర్డ్ వైకుంఠధామం వద్ద అత్యవసరంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను, అలాగే వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో తక్షణమే పునరుద్ధరణ పనులను అత్యవసరంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.