VIDEO: బిర్యానీ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

VIDEO: బిర్యానీ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

E.G: అనపర్తి మెయిన్ రోడ్‌లోని ఓ బిర్యానీ సెంటర్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. వంటలు తయారు చేస్తున్న సమయంలో గ్యాస్ పైప్ నుంచి లీకై మంటలు వచ్చాయి. ఆ సమయంలో పక్కనే ఉన్న నూనె కారణంగా మంటలు ఎగిసి పడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. కాగా.. రూ. 2.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపాడు.