వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలి: MLA

వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలి: MLA

HNK: పరకాల పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.