ఫలితాలపై అస్పష్టత విద్యార్థుల నిరాశ

VSP: జిల్లా ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ముగిసిన 2 నెలలు గడిచినా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఫలితాలపై సమాచారం కోసం కాల్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, లేదా లిఫ్ట్ చేసిన సిబ్బంది రూఢిగా ప్రవర్తించడం విద్యార్థులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది. వీసీ డా. జీ.పీ. రాజశేఖర్ వెంటనే చర్యలు తీసుకోని ఫలితాలు విడుదల చేసేందుకు చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.