యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళ్తోంది: మాజీమంత్రి

యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళ్తోంది: మాజీమంత్రి

TG: యూరియా కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యూరియా కొరతపై ప్రభుత్వం డ్రామాలోడుతోందని మండిపడ్డారు. మంత్రులు కమీషన్ల కోసం ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి సోయిలేదంటూ విమర్శించారు. వారం రోజుల్లోగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.