జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
SRD: ఏడు వారాల నల్ల పోచమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖేడ్ MLA సంజీవరెడ్డి అన్నారు. బుధవారం మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయ అధికారులతో సమావేశమై ఈనెల 23 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే జాతర ఉత్సవాలపై సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం, చలువ పందిళ్లు వెయ్యాలన్నారు.