టీనేజ్ గర్భధారణ నివారణపై అవగాహన

టీనేజ్ గర్భధారణ నివారణపై అవగాహన

మన్యం జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు టీనేజ్ గర్భధారణ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో గర్భధారణ వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు దెబ్బతింటాయని తెలిపారు. టీనేజ్ గర్భధారణ నివారణ సమాజ బాధ్యత అని తెలిపారు. అలాగే, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.