కలెక్టర్ పేరే ఆ ఊరి పేరు

కలెక్టర్ పేరే ఆ ఊరి పేరు

అన్నమయ్య: 1954లో పింఛ జలాశయం నిర్మాణం వల్ల మునిగిపోయిన గొందిపల్లె గ్రామస్తులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణన్ పునరావాసం కల్పించారు. అతని కృషికి కృతజ్ఞతగా, ఉమ్మడి కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడుత గ్రామం వద్ద 46 కుటుంబాలకు ఇళ్లు, వ్యవసాయ భూములు కేటాయించారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి గోపాలకృష్ణాపురంగా పేరు పెట్టుకున్నారు.