బీరప్ప స్వామి ఆలయ కమిటీ ఎన్నిక
NLG: బీబీనగర్ మండలం కొండమడుగులో శ్రీ బీరప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి కురుమ సోదరులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో కమిటీ ఛైర్మన్‌గా కడెం విక్రమ్, వైస్ ఛైర్మన్‌గా నారి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గొరిగే శంకర్, కోశాధికారిగా బాల్ద భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.