'ప్రతిపక్షాలను గౌరవిస్తూ రాజకీయం చేయాలి'

GNTR: ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేసేందుకు బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఇందు కోసం రాజ్యాంగ సవరణ కూడా చేయడం సరైన విధానం కాదన్నారు. నియంత పరిపాలనకు ఇది నిదర్శమని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.